Skip to main
Tirigi Cheraanayya artwork

Tirigi Cheraanayya

abhilash020603

· 4:45 · 1 play · v3-preview

Lyrics

Instrumental Intro

Chorus

చిన్ననాటి నీ ప్రేమను మరచానయ్యా

దూరంగా ఒంటరిగా విడిపోయాను

కన్నీటితో నిను వేడుకుంటున్నానయ్యా

నన్ను చేరదీస్తావా యేసయ్యా

చీకట్లో నా బ్రతుకు కరిగిపోతుంటే

భయముతో నా గుండె వణికిపోతుంటే

ఆఖరి సారిగా నిను అడుగుతున్నానయ్యా

నన్ను క్షమించగలవా యేసయ్యా

Instrumental Interlude

Verse 1

చిన్నప్పుడేమో నీ పాదాల చెంత

ఎంతో ఆనందంగా బ్రతికేసాను

కాని కాలం మారాక నా లోకం మారాక

నిన్ను విడచి పాపంలో పడిపోయాను

స్వార్ధంతో కళ్ళు మూసుకుపోయి

దేవుడే లేడంటూ అహంకరిస్తూ

ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ

నా హృదయాన్ని నేనే కాల్చుకున్నాను

నీవంటూ లేవంటూ ఎగతాళి చేసాను

నా అపవిత్ర బ్రతుకుతో నిను దూషించాను

ఇప్పుడేమో ఓడిపోయి పిచ్చివాడనై

నీ ముందే శవములా నిలబడ్డాను

Chorus

నన్ను క్షమించగలవా యేసయ్యా

నన్ను క్షమించగలవా యేసయ్యా

Instrumental Interlude

Verse 2

ఒంటరితనం నన్ను మింగేస్తుంటే

ప్రతి రాత్రి గుండెల్లో గుబులవుతుంటే

నేను చేసిన పాపాలే గుర్తొస్తూ

భయంతో శరీరం వణికిపోతుంటే

ఎవరున్నారు నాకు ఇల లోకంలో

స్నేహితులు ఆ బంధాలు అన్నీ దూరం

నా అపనమ్మకాలే నన్ను చంపేస్తుంటే

నీ గుమ్మం ముందర పడిపోయాను

నువ్వు నన్ను అసహ్యించుకుంటావా

ఈ ద్రోహిని దూరం పెడతావా

నేను ఘోర పాపినయ్యా పరమ చండాలుడనయ్యా

నీ చేతితో నన్ను కాస్త తాకవా

Chorus

నన్ను క్షమించగలవా యేసయ్యా

నన్ను చేరదీస్తావా యేసయ్యా

Outro

తండ్రి నేను నీ పాపిష్టి కుమారుణ్ణి

తిరిగి వచ్చేసాను

నువ్వు లేని ఈ లోకంలో నేను బ్రతకలేను

భయమేస్తోంది

నన్ను పట్టుకోవా

నన్ను నీలోనే దాచుకోవా

యేసయ్యా

యేసయ్యా

Comments

No comments yet.